సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. పోలీసు చెంప చెల్లుమ‌నిపించిండు

  సహనం కోల్పోయిన ఎమ్మెల్యే..  పోలీసు చెంప చెల్లుమ‌నిపించిండు

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే ఓ పోలీస్ అధికారిపై చేయి చేసుకున్నారు.  ఈ ఘటన పూణేలో జరిగింది. పూణెలోని సాసూన్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే  వేదికపై నుంచి వెళుతూ పోలీసు చెంప చెల్లుమనిపించారు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

పోలీసును కొట్టిన ఎమ్మెల్యే సునిల్‌పై కేసు న‌మోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు బుక్ చేశారు. పుణెలోని బుంద్‌గార్డెన్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయ్యాయి. ఘటన జరిగినప్పుడు వేదికపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఉన్నారు. ఈ వీడియోపై ఎమ్మెల్యే సునీల్ స్పందించారు. తాను కావాలని అతన్ని కొట్టలేదని అతను తనను నెట్టాడని ఆరోపించారు.  

అంతకుముందు ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి చెందిన మహిళా ఉద్యోగినిని వేధించాడనే ఆరోపణలతో ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. సునీల్ కాంబ్లే పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మె్ల్యేగా ప్రాతినిధ్యం వ్యవహరిస్తున్నారు.