అసెంబ్లీలో రాత్రంతా భజనలు.. నినాదాలతో BJP, JD(S) ఎమ్మెల్యేలు నిరసన

అసెంబ్లీలో రాత్రంతా భజనలు.. నినాదాలతో BJP, JD(S) ఎమ్మెల్యేలు నిరసన

కర్ణాటక రాష్ట్రం అసెంబ్లీలో బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష నాయకులు బుధవారం రాత్రంతా అసెంబ్లీలో నిద్రపోయారు. అపోసిషన్ లీడర్ ఆర్‌.అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీవై విజయేంద్ర సహా శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో నిద్రపోయారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ జరగాలని బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

చర్చకు అనుమతించపోవడంతో వారు కాంగ్రెస్ గవర్నమెంట్, సిద్ధరామయ్య, స్పీకర్ యుటి ఖాదర్‌లకు వ్యతిరేకంగా భజన చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. ముడా కుంభకోణానికి సంబంధించి విపక్షాల వాయిదా తీర్మానం నోటీసును అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ తిరస్కరించారు, ప్రధాన ప్రతిపక్ష శాసనసభ్యులు అసెంబ్లీ లోపల పగలు, రాత్రి నిరసన చేపట్టారు. ఈ నిరసనలో విధానసభలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణస్వామి, సిటి రవి సహా బిజెపి, జెడిఎస్‌తోపాటు పలువురు శాసనసభ, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు.