
దుబ్బాక ఉప ఎన్నికలు చరిత్ర సృష్టించబోతున్నాయని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. టీఆర్ఎస్ పతనానికి ఇదే నాంది పాలకబోతోందన్నారు. ఎలాగైనా గెలవాలని మంద బలంతో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తోందన్నారు. ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ను బీజేపీ నేతలతో కలిసినిన రామచంద్రరావు.. నిన్నటి దుబ్బాక ఘటన, ఆ తర్వాతి పరిణామాలను వివరిస్తూ ఎన్నికల అధికారికి వినతిపత్రం అందించారు. లోకల్ పోలీసులపై నమ్మకం లేదన్న ఆయన.. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని ఈసీని కోరారు. సిద్దిపేట పొలీస్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో బీజేపీ నైతికంగా విజయం సాధించిందన్నారు.
సిద్దిపేటలో మా అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు బంధువుల ఇళ్లపై దాడులు అప్రజాస్వామిక చర్య అని..పోలీసులు బయపెట్టేవిధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా…? టీఆరెస్ ఓడిపోతుందని భయంతోనే ఇలాంటివి చేస్తున్నారన్నారు. టీఆరెస్ పార్టీ ఈ ఆరు సంవత్సరాల్లో ఎక్కడ కూడా డబ్బులు లేకుండా గెలవలేదని..టీఆరెస్ ఓట్లు కొనాలని చూస్తుందన్నారు. ప్రజల సంకల్పం ముందు మీ డబ్బు పనిచేయదన్నారు ఎమ్మెల్సీ రామచంద్రరావు.