రిలయన్స్ చేతికి బ్రైల్‌‌‌‌క్రీమ్, టోనీ అండ్‌‌‌‌ గయ్‌‌‌‌ బ్రాండ్లు.. 60శాతం పెరిగిన ఆదాయం..

 రిలయన్స్ చేతికి  బ్రైల్‌‌‌‌క్రీమ్, టోనీ అండ్‌‌‌‌ గయ్‌‌‌‌ బ్రాండ్లు.. 60శాతం పెరిగిన  ఆదాయం..

న్యూఢిల్లీ:  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌కి చెందిన ఎఫ్‌‌‌‌ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌సీపీఎల్‌‌‌‌), ఇంటర్నేషనల్ పర్సనల్‌‌‌‌ కేర్ బ్రాండ్లయిన బ్రైల్‌‌‌‌క్రీమ్, టోనీ అండ్‌‌‌‌ గయ్‌‌‌‌, బాడెడాస్‌‌‌‌ల  గ్లోబల్ హక్కులను దక్కించుకుంది. దీంతో పాటు  యూకేకి చెందిన పిల్లల  పర్సనల్‌‌‌‌ కేర్ బ్రాండ్‌‌‌‌ మేటీని కూడా కొనుగోలు చేసింది. ఆర్‌‌‌‌‌‌‌‌సీపీఎల్‌‌‌‌ ఈ బ్రాండ్ల ప్రొడక్ట్‌‌‌‌లను భారత్‌‌‌‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మనుంది. కాగా,  బ్రైల్‌‌‌‌క్రీమ్, టోనీ అండ్ గయ్‌‌‌‌  ప్రీమియం హెయిర్ కేర్ బ్రాండ్లు.  ఆర్‌‌‌‌‌‌‌‌సీపీఎల్‌‌‌‌ ఇప్పటికే తమిళనాడుకు చెందిన వెల్వెట్ బ్రాండ్‌‌‌‌ను కొనుగోలు చేసి, మార్కెట్‌‌‌‌లోకి తెచ్చింది. అలాగే గ్లిమ్మర్, గెట్ రియల్ వంటి స్వంత బ్రాండ్లతో తక్కువ ధరలో స్నానపు ఉత్పత్తులను అందిస్తోంది. డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఈ కంపెనీ ఆదాయం ఏడాది లెక్కన 60శాతం పెరిగి రూ.5,065 కోట్లకు చేరగా,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.15వేల కోట్లను దాటింది. కంపెనీ ఇటీవల ఉదయమ్స్ అగ్రో ఫుడ్స్‌‌‌‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం తెచ్చే నాలుగు బ్రాండ్లు ఉన్నాయి. అవి కాంపా, ఇండిపెండెన్స్, గుడ్ లైఫ్,  కాంపా ఎనర్జీ. ఆర్‌‌‌‌‌‌‌‌సీపీఎల్‌‌‌‌ రూ.40వేల కోట్లతో ఫుడ్ పార్కులు కూడా ఏర్పాటు చేస్తోంది.