బీఆర్ఎస్, ఆప్ బంధానికి లిక్కర్ స్కాం పునాది : లక్ష్మణ్

 బీఆర్ఎస్, ఆప్ బంధానికి లిక్కర్ స్కాం  పునాది : లక్ష్మణ్

బీఆర్ఎస్, ఆప్ పార్టీల మధ్య బంధానికి ఢిల్లీ లిక్కర్ స్కాం పునాదని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. తప్పు చేస్తే చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని,  చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతాయని చెప్పారు. ప్రధాని మోడీ మహిళలకు పెద్దపీట వేసి రాజ్యాంగ పదవుల్లో స్థానం కల్పిస్తుంటే.. కేసీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం రాజ్యాంగ పదవుల్లో ఉన్న మహిళలను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. 

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ ను ప్రవేశపెట్టామని లక్ష్మణ్ అన్నారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు. చిన్న, సన్నకారు రైతుల ప్రాధాన్యత పెంచేందుకు హైదరాబాద్ లో మిల్లెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  ప్రపంచవ్యాప్తంగా కోవిడ్, రష్యా- ఉక్రెయిన్ వార్ వల్ల ఇబ్బంది పడుతుంటే.. అన్ని దేశాలు భారత్ వైపు చూసేలా బడ్జెట్ ప్రవేశపెట్టామని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయంటే అందుకు మోడీనే కారణమన్నారు.