
ఉత్తరాఖండ్: కారు ప్రమాదంలో బీజేపీ ఎంపి ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన భీమ్‌గోడ-పంత్ సమీపంలో జరిగింది. గర్హ్వాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు భీమ్‌గోడ-పంత్ డీప్ సమీపంలో ఈ రోజు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంపీ తీరత్ సింగ్ రావత్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం రావత్‌ను హరిద్వార్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రావత్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.