రేవంత్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే: ఎంపీ రఘునందన్ రావు

రేవంత్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే: ఎంపీ రఘునందన్ రావు
  • కొడంగల్ కు 4369 కోట్లా?
  • వివక్ష అంటే ఇదే:  ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్​: కేంద్ర బడ్జెట్​లో తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిందన్న సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ  రఘునందన్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్​ వేదికగా ఆయన  కొడంగల్ నియోజకవర్గంలో రూ.4369.143 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం అని గతంలో ఓ దిన పత్రిక ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేశారు.  

 "వివక్ష అంటే ఇది" రేవంత్ రెడ్డి అంటూ.. గాడిద గుడ్డు ముచ్చట్లు కాదు. నీ సొంత నియోజకవర్గానికి రూ.4369 కోట్లు కేటాయించుకుని 118 నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిన నువ్వు సమానత్వం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది’’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు.