
- చంపేస్తామని వార్నింగ్ ఇచ్చిన దుండగులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోమారు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. 94043 48431 నంబర్ నుంచి ఆ కాల్ వచ్చింది. “ఈ సాయంత్రం వరకు నీవు బతకవు, ఎవరు రక్షిస్తారో చూస్తాం” అని దుండగులు రఘునందన్ రావును హెచ్చరించారు.
ఈ కాల్ పై పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. ఆయనకు ఇంతకుముందు కూడా అలాంటి కాల్స్ వచ్చాయి. ఇది ఆరో బెదిరింపు కాల్. గతంలో చత్తీస్‌గఢ్‌లో ‘ఆపరేషన్ కగార్’ ను నిలిపివేయాలని మావోయిస్టుల పేరుతో బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లో తమ బృందం ఉందని, వెంటనే చంపేస్తామని రెండు వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయి. వరుస బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.