రూ.15లక్షల్లోపు అవినీతి చేస్తే వదిలేయండి

రూ.15లక్షల్లోపు అవినీతి చేస్తే వదిలేయండి

మధ్యప్రదేశ్ : బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రా అవినీతికి కొత్త భాష్యం చెప్పారు. రూ.15లక్షల లోపు అక్రమాలకు పాల్పడితే అది అవినీతి కాదని అన్నారు. మధ్యప్రదేశ్ లోని రేవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ లు అవినీతికి పాల్పడుతున్నారని చాలా మంది ప్రజలు తన వద్దకు వస్తున్నారని.. అయితే రూ.15లక్షలు గానీ అంతకన్నా ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడే తన వద్దకు రావాలని వారికి చెబుతున్నాని అన్నారు. రూ.15 లక్షల లోపు అవినీతికి పాల్పడే వారిని వదిలేయాలని చెప్పారు. అందుకు కారణాలను ఎంపీ వివరించారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.7 లక్షలు, తదుపరి ఎన్నికల కోసం మరో 7 లక్షలు, అదనంగా మరో లక్ష ఖర్చు చేస్తున్నారని అన్నారు. అంతకు మించి అవినీతికి పాల్పడితే మాత్రం తన దృష్టికి తేవాలని చెప్పారు. అవినీతి విషయంలో ఎంపీ చెప్పిన మాటలు విన్న జనం అవాక్కయ్యారు. ఎంపీ జనార్థన్ మిశ్రా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

For more news...

న్యూ ఇయర్ వేడుకలు.. ఒంటి గంట వరకు బార్లు ఓపెన్

ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్