లిక్కర్ స్కాంలో కవితను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుండు

లిక్కర్ స్కాంలో కవితను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుండు

కేసీఆర్ పార్టీకి వందల కోట్ల నిధులు ఎక్కడినుంచి వచ్చాయని బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. కమీషన్ల ద్వారానే ఆ పార్టీకి నిధులు పెరిగాయని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబం ఇరుక్కుందని.. కవితను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. మిషన్ భగీరథ్ స్కీం ఫెయిల్ అన్న వివేక్..ప్రాజెక్టుల పేర్లతో కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అని విమర్శించారు.  

మునుగోడు ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో కొత్త నాటకానికి తెరదీశాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మునుగోడు ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని.. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన బీజేపీ విజయాన్ని ఆపలేరన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తున్నారన్నారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవొద్దని కోరారు. ప్రభుత్వం చెప్పేదానికి క్షేతస్థాయిలో జరిగిన అభివృద్ధికి పొంతననే లేదన్నారు. ప్రజాసంక్షేమానికి ప్రధాని కృషి చేస్తున్నారని..ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.