
నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓటమి ఖాయమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మమతను గద్దె దించేందుకు బెంగాల్ ప్రజలు ఆసక్తిగా ఉన్నారన్నారు. బెంగాల్ లో ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయన్న నడ్డా.... తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయంలో ఫస్ట్, సెకండ్ ఫేస్ పోలింగ్ లో స్పష్టం అయిందన్నారు. నందిగ్రామ్ లో మమత ఓడిపోతోందని, అందుకే మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అస్సాం సంస్కృతిపై రాహుల్ గాంధీకి అవగాహన లేదన్నారు నడ్డా. మోడీ సంకల్పం, అమిత్ షా వ్యూహాలు ఈ సమస్యను పరిష్కరించాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తోందన్నారు.