మభ్యపెట్టడానికే హడావిడి : డీకే అరుణ

మభ్యపెట్టడానికే హడావిడి : డీకే అరుణ
  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

గద్వాల, వెలుగు : ఐదేళ్లుగా ఎలాంటి పనులు చేయకుండా.. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు హడావుడిగా అభివృద్ధి పనులు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. సోమవారం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. భూసేకరణ చేయకుండా పట్టాలు ఎట్లా ఇస్తారని వీటిపై కలెక్టర్ స్పందించి, రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదివరకే ఆఫీసర్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చినా... ఇప్పుడు ఓపెన్​ చేయడం ఏంటని ప్రశ్నించారు. లీడర్ల చేతకాని తనం వల్ల గద్వాలలో అభివృద్ధి జరగలేదన్నారు. నియోజవర్గంపై అవగాహన లేని ప్రతి ఒక్కరూ ఓట్లు అడిగేందుకు వస్తున్నారని  ఎద్దేవా చేశారు.

గజం స్థలం సేకరించలేని వారు పేదల ఇండ్ల పట్టాలు లాక్కొని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నర్సింగ్ కాలేజీ కట్టారని అన్నారు. ఉత్తర్వులు లేని మెడికల్ కాలేజీకి ఏ విధంగా శంకుస్థాపన చేస్తారని నిలదీశారు. అధికార దుర్వినియోగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీనిపై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకటరాములు, వెంకటేశ్వర్ రెడ్డి, కుమ్మరి శ్రీనివాసులు, అనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.