మాది రైతుల ప్రభుత్వం.. మద్దతు ధర పెంపు హర్షణీయం: వివేక్ వెంకటస్వామి

మాది రైతుల ప్రభుత్వం.. మద్దతు ధర పెంపు హర్షణీయం: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ నిర్ణయంతో తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని మరోసారి రుజువైందని చెప్పారు. యూపీఏ పాలనతో పోలిస్తే పంటలకు రెట్టింపు ధర అందించడమే లక్ష్యంగా ముందుకుపోతున్నామని తెలిపారు. ‘‘కేంద్ర నిర్ణయంతో రైతుల కష్టానికి మరింత ప్రతిఫలం దక్కుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి, పల్లి, పెసర్లు, నువ్వులు, మినుములు, కందుల కనీస మద్దతు ధర భారీగా పెంచారు. వడ్లకు కనీస మద్దతు ధర రూ.143 పెంచడంతో వచ్చే వానాకాలం నుంచి క్వింటాల్ కు రూ.2,183 లభిస్తుంది. రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ, కేంద్ర కేబినెట్ కు ధన్యవాదాలు” అని వివేక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.