యాదాద్రి, వెలుగు: యాదాద్రి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ కోరారు. వలిగొండలోని భీమలింగేశ్వర స్వామికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. గతేడాది సీఎం పుట్టిన రోజు సందర్భంగా వలిగొండకు వచ్చిన సంగతిని గుర్తు చేశారు. సంగెం వద్ద మూసీపై బ్రిడ్జి నిర్మాణం ఇప్పటివరకూ ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు.
పుట్టిన రోజున ఇచ్చిన హామీని సీఎం మరిచిపోయాడని తెలిపారు. ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బోళ్ల సుదర్శన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాశం భాస్కర్, కొప్పుల యాదిరెడ్డి, కాదూరి అచ్చయ్య, రత్నపురం బలరామ్, పకీర్ రాజేందర్ రెడ్డి, ఏలే చంద్రశేఖర్, మత్సగిరి ఉన్నారు.
