ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు బీజేపీ అండ : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు

ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు బీజేపీ అండ : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు
  • బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు
  • ముప్కాల్ లో పార్టీ అభ్యర్థికి పరామర్శ

బాల్కొండ, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులకు బీజేపీ అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం నిర్మల్​కు వెళ్తున్న ఆయన ముప్కాల్ లో ఓడిన అభ్యర్థి గడ్డం వసంత సంతోష్ ను పరామర్శించారు. ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.గతంలో ఎన్నడూ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో నిలుపలేదని, ఇప్పుడు ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 కార్యక్రమంలో ముప్కాల్, బాల్కొండ, మెండోరా మండలాల అధ్యక్షులు గడ్డం సంతోష్, అంబటి నవీన్, ముత్తెన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, ముస్కు భూమేశ్వర్, ముస్కు నర్సయ్య, దినేశ్, నవీన్, వాచ్ నర్సయ్య, గోపినాథ్, శివశంకర్, సాగర్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. 

ఆర్మూర్​ లో ఘన స్వాగతం

​ఆర్మూర్ : బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్ రామచంద్ర రావు కు శుక్రవారం ఆర్మూర్ లో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్​ వద్ద జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి,  పెద్దోళ్ల గంగారెడ్డి, అల్జాపూర్​ శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్ స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి వేణు,  బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్ మందుల బాలు, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, నర్సారెడ్డి, ప్రసన్న గౌడ్, కుమార్, అరుణ్ కుమార్,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.