
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నాలుగో విడత అభ్యర్థుల జాబితాను బుధవారం విడుదల చేసింది. నాలుగు అన్ రిజర్వ్డ్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి కొత్త వ్యక్తులనే బరిలో దింపింది. బెల్టారా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రజనీశ్ సింగ్‌కు టికెట్ నిరాకరించిన అధిష్టానం.. బీజేవైఎం కో ఇన్చార్జిగా ఉన్న సుశాంత్ శుక్లాకు అవకాశం ఇచ్చింది.
అత్యంత ప్రాధాన్యం కలిగిన అంబికాపూర్ స్థానంలో పార్టీ రాజేశ్ అగర్వాల్‌ను పోటీకి దింపింది. అంబికాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే టీఎస్ సింగ్ డియో పోటీ చేస్తున్నారు. బీజేపీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల్లో 33 మంది ఓబీసీలు, 30 మంది ఎస్టీలు, 10 మంది ఎస్సీలు, మిగతా వారు ఉన్నట్లు బీజేపీ మీడియా జాయింట్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.
బీజేపీకి ప్రస్తుతం13మంది ఎమ్మెల్యేలు ఉండ గా, వారిలో ఇద్దరికి పార్టీ టికెట్ఇవ్వలేదు. అధికార కాంగ్రెస్ కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక్కడ నవంబర్ 7, 17వ తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్3న ఫలితాలు వెలువడనున్నాయి.