
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసే అవకాశం ఉంది. 30 నుంచి 35 మందితో సెకండ్ లిస్ట్ ఉండనున్నట్లు తెలిసింది. సెకండ్ లిస్టుపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.
సీనియర్ నేతల నియోజకవర్గాలు, ఆ నేతల పోటీపై హైకమాండ్ కు కిషన్రెడ్డి వివరించనున్నారు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు, ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలనే దానిపై కూడా ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.