వెస్ట్ బెంగాల్‌‌లో హింసాత్మక ఘటనలు..బీజేపీపై మమత ఫైర్

వెస్ట్ బెంగాల్‌‌లో హింసాత్మక ఘటనలు..బీజేపీపై మమత ఫైర్

పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై వెస్ట్ బెంగాల్  సీఎం మమత బెనర్జీ సీరియస్ అయ్యారు. వీటి వెనుక కొన్ని రాజకీయ పార్టీలు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. హౌరా ఘర్షణపై మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేపీ చేసిన తప్పులకు సామాన్యులు ఎందుకు శిక్ష అనుభవించాలని ట్వీట్ చేశారు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మమతా బెనర్జీ.   దేశ వ్యాప్తంగా రెండు రోజులుగా పలు హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన కామెంట్లకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీ, యూపీ, బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ సహా అనేక ప్రాంతాల్లో ముస్లింలు ర్యాలీలు నిర్వహించాయి. వారిని తక్షణమే అరెస్టు చేయాలని మమత డిమాండ్ చేశారు. హింస చెలరేగడమే కాకుండా.. దేశ సమైక్యత దెబ్బ తినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.