మంత్రి గంగులకు బండి సంజయ్ పరామర్శ 

మంత్రి గంగులకు బండి సంజయ్ పరామర్శ 

కరీంనగర్ :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు. ఇటీవల చనిపోయిన కమలాకర్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. కాసేపు గంగుల కమలాకర్ తో కూర్చొని టీ తాగి వెళ్లారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) ఇటీవలే మృతిచెందిన విషయం తెలిసిందే.