ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

దండేపల్లి,వెలుగు: తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం లక్సెట్టిపేటలో జరిగిన ప్రజా గోస – బీజేపీ భరోసా బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూడెం సత్యనారాయణస్వామి వారిని దర్శించుకున్న  అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, యువమోర్చా అధ్యక్షుడు ఎగ్గడి నాగరాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్​ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు అసమర్థత వల్లనే  లక్సెట్టిపేటలో 150 బెడ్స్​ హాస్పిటల్​, ఫైర్ స్టేషన్ మంజూరు కావడం లేదన్నారు. మెడికల్ కాలేజీకి ఎంసీఐ పర్మిషన్​ రాలేదన్నారు. నాయకులు రాజయ్య, వీరమల్ల హరిగోపాల్, రంగారావు, ​ సిసోడియా, గుండా ప్రభాకర్, తమ్మినిడి శ్రీనివాస్, వేముల మధు, బందెల రవిగౌడ్, తోడేటి హరికృష్ణ, గడికొప్పుల చంద్రమౌళి, ఆకుల అశోక్​వర్ధన్, బొప్పు కిషన్, వంగపల్లి వెంకటేశ్వర్​రావు పాల్గొన్నారు. 

చైనా ఉత్పత్తులు బహిష్కరించాలి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ప్రతీ ఒక్కరు దేశీయ ఉత్పత్తులను వాడాలని, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్​రెడ్డి కోరారు. శనివారం నిర్వహించిన ‘లోకల్​ ఫర్​ లోకల్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.​ మహిళలు పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల ఏరియాల్లో తయారైన చేనేత చీరలు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు మయూర్ చంద్ర, రాందాస్, రమేశ్, రాము, దాము, భీమ్​సేన్​రెడ్డి, బోపేందర్, రాకేశ్​ పాల్గొన్నారు. 

నిర్మల్​లో..

నిర్మల్,వెలుగు: నిర్మల్​లో బీజేపీ ఆధ్వర్యంలో లోకల్​ఫర్​ లోకల్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ లీడర్లు కొయ్యబొమ్మల కేంద్రాన్ని పరిశీలించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, రాజేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ జానుబాయి, ఉపాధ్యక్షురాలు, మెడికల్ సెల్​ కన్వీనర్​ ​మల్లికార్జున్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రావణ్, పార్టీ టౌన్  ప్రెసిడెంట్ అర్వింద్,​ లీడర్లు వెంకటేశ్, వినాయక్​ రెడ్డి, మురళీధర్, భూపతిరెడ్డి, భాస్కర్, శ్రీరాం, నరేశ్​ పాల్గొన్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

కడెం/జన్నారం,వెలుగు: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ చెప్పారు. శనివారం ఆమె కడెం ప్రాజెక్టులో చేప పిల్లలు వదిలారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు వదులుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ నర్సిహరావు, ఎఫ్​డీవో సుమలత, ఫీల్డ్​మెన్ రాజేందర్, రమేశ్ లీడర్లు పాల్గొన్నారు.

ఆడపడుచులకు అండగా ప్రభుత్వం..

ఆడపడుచులకు టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. శనివారం జన్నారం మండలంలోని ఆయా గ్రామాల లబ్ధదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శేషాద్రి, ఎంపీడీవో అరుణారాణి, తహసీల్దార్​కిషన్, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి, మాజీ మండల ప్రెసిడెంట్ భరత్ కుమార్, వైస్ ఎంపీపీ వినయ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేశ్ యాదవ్, పోన్కల్​సర్పంచ్ భూమేశ్​,కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

భైంసా,వెలుగు: విద్యార్థులు బాగా చదవి ఉన్నతశిఖరాలు అదిరోహించాలని ముథోల్​ఎమ్మెల్యే విఠల్​రెడ్డి కోరారు. భైంసా సుభద్రవాటిక సరస్వతీ శిశు మందిర్​లో మూడ్రోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్​ఫెయిర్​ శనివారం ముగిసింది. కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్​హాజరయ్యారు. విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్స్​పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు విద్యాపీఠం ప్రాంత అధ్యక్షుడు తిరుపతిరావు, రాష్ట్ర ఐటీ ఆఫీసర్​ ప్రకాశ్​​ రాథోడ్​, స్కూల్​ అధ్యక్షుడు దిగంబర్  మాశెట్టివార్, రమేశ్​ మాశెట్టివార్, మున్సిపల్​ మాజీ చైర్మన్​ గంగాధర్​ పాల్గొన్నారు.

ఇచ్చిన హామీలను నేరవేస్తున్నాం..

ప్రభుత్వం హామీలు  నెరవేరుస్తోందని ఎమ్మెల్యే విఠల్​రెడ్డి తెలిపారు. శనివారం ఆయన భైంసా ఎంపీపీ ఆఫీస్​లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీపీ కల్పన,  వైస్ ఎంపీపీ గంగాధర్, సర్పంచులు ప్రవీణ్, గణేశ్, కోఆప్షన్​  మెంబర్​ గజానంద్, భీంరావు, గణేశ్, పోతన్న​ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సన్మానం...

లోకేశ్వరం,వెలుగు: ‘అమ్మ నాన్న ఫౌండేషన్, ఫుడ్ బ్యాంక్  భైంసా’ ఆధ్వర్యంలో 12 సంత్సరాలుగా చేస్తున్న సేవలకు గుర్తింపు లభించడం అభినందనీయమని ఎమ్మెల్యే విఠల్​రెడ్డి చెప్పారు. ఫౌండేషన్​ చైర్మన్​ ఆంజనేయులను సన్మానించారు. సర్పంచ్  దిగంబర్, పీఏసీఎస్  డైరెక్టర్ లస్మన్న, కనకాపూర్ సర్పంచ్ నరేశ్​, ప్రకాశ్, గజ్జారాం పాల్గొన్నారు.

మావోయిస్టులకు సహకరించవద్దు

బెల్లంపల్లి,వెలుగు: మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని ఏసీపీ ఎడ్ల మహేశ్​సూచించారు. శనివారం బెల్లంపల్లిలో కార్డన్​సెర్చ్​నిర్వహించారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా పేపర్స్​సరిగ్గాలేని టూ 60 వీలర్స్​ను సీజ్​చేశారు.  తనిఖీల్లో సీఐలు ముష్క రాజు, కోట బాబురావు, కె. జగదీశ్, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.

బకాయిల మాఫీ హక్కు సింగరేణికి ఎక్కడిది

నస్పూర్​,వెలుగు: బకాయిలను మాఫీ చేసే హక్కు సింగరేణి యాజమాన్యానికి ఎక్కడిదని బీఎంఎస్​ స్టేట్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పేరం రమేశ్​ప్రశ్నించారు. శనివారం శ్రీరాంపూర్  ఏరియా ఆర్కే-7 గనిపై బీఎంఎస్​ ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ బరపాటి మారుతి ఆధ్వర్యంలో గేట్​మీటింగ్​ నిర్వహించారు. సమావేశానికి రమేశ్​హాజరై మాట్లాడారు. లాభాల వాటా ప్రకటించడంలో సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్నాయన్నారు. సింగరేణి డైరెక్టర్ల బోర్డు జెన్​కోకు రూ.1600 కోట్ల అప్పు, వడ్డీ మాఫీ చేయాలని తీర్మానించడాన్ని బీఎంఎస్​వ్యతిరేకిస్తుందన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా వివ్వాలని డిమాండ్​చేశారు. సమావేశంలో సెక్రటరీ పొడిశెట్టి వినోద్​కుమార్, గోపతి సందీప్, రాజు, మహేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

చైనా ఉత్పత్తులు బహిష్కరించాలి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ప్రతీ ఒక్కరు దేశీయ ఉత్పత్తులను వాడాలని, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్​రెడ్డి కోరారు. శనివారం నిర్వహించిన ‘లోకల్​ ఫర్​ లోకల్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.​ మహిళలు పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల ఏరియాల్లో తయారైన చేనేత చీరలు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు మయూర్ చంద్ర, రాందాస్, రమేశ్, రాము, దాము, భీమ్​సేన్​రెడ్డి, బోపేందర్, రాకేశ్​ పాల్గొన్నారు. 

నిర్మల్​లో..

నిర్మల్,వెలుగు: నిర్మల్​లో బీజేపీ ఆధ్వర్యంలో లోకల్​ఫర్​ లోకల్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ లీడర్లు కొయ్యబొమ్మల కేంద్రాన్ని పరిశీలించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, రాజేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ జానుబాయి, ఉపాధ్యక్షురాలు, మెడికల్ సెల్​ కన్వీనర్​ ​మల్లికార్జున్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రావణ్, పార్టీ టౌన్  ప్రెసిడెంట్ అర్వింద్,​ లీడర్లు వెంకటేశ్, వినాయక్​ రెడ్డి, మురళీధర్, భూపతిరెడ్డి, భాస్కర్, శ్రీరాం, నరేశ్​ పాల్గొన్నారు

నిర్మల్​ విద్యార్థులకు వారధి అవార్డులు

నిర్మల్,వెలుగు: రిటైర్డు ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్​మోహన్​కందా చైర్మన్​గా వ్యవహరిస్తున్న వారధి ఫౌండేషన్ రాష్ట్ర స్థాయి అవార్డులకు నిర్మల్​ విద్యార్థులు ఎంపికయ్యారు. ఉపన్యాస పోటీల్లో స్థానిక రెసిడెన్షియల్​గర్ల్స్​స్కూల్​కు చెందిన గాదేవార్​ ఐశ్వర్య, శ్రీనిధ్య, రావుల నిత్యశ్రీ, వ్యాసరచన పోటీల్లో గంగడి అభిజ్ఞారెడ్డి, రెడ్డిమల్ల శ్రీహర్షిణి, తాండ్రా సాత్విక ప్రతిభ కనబర్చి అవార్డులు దక్కించుకున్నారు. వీరికి ఫౌండేషన్​తరఫున ఒక్కొక్కరికి రూ. 12 వేల నగదు అందించారు. శనివారం డీఈవో రవీందర్ రెడ్డి అవార్డులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ గంగాశంకర్, జిల్లా సెక్టోరియల్ కోఆర్డినేటర్​సామల రాజేశ్వర్, నర్సయ్య, నాగుల రవి, శ్రీదేవ పాల్గొన్నారు.

నెలన్నర బాబుకు మోకాలి ఆపరేషన్​ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని ఎయిమ్స్​ హాస్పిటల్​లో నెలన్నర బాలుడికి మోకాలి ఆపరేషన్​ విజయవంతంగా నిర్వహించారు. బెల్లంపల్లికి చెందిన ముక్కెర నరేష్​, రజిత దంపతులకు ఇటీవలే పుట్టిన బాబుకు మోకాలిలో సమస్య (సెప్టిక్​ ఆర్థరైటిస్​ నీ విత్​ సెప్టాసీమియా) వచ్చింది.  డాక్టర్​ యెగ్గెన శ్రీనివాస్​ వైద్యపరీక్షలు నిర్వహించి అత్యవసరంగా ఆపరేషన్​ చేశారు. పూర్తిగా కోలుకున్న బాబును శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు.  ఎయిమ్స్​లో పిడియాట్రిక్​ ఆర్థోపెడిక్​ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని డాక్టర్​ శ్రీనివాస్​ తెలిపారు. నవజాత శిశువుల నుంచి 15 ఏండ్ల పిల్లల వరకు ఎన్నో ఆపరేషన్లు చేశామన్నారు.  

రక్తదానం చేసి ఆదుకోవాలి

ఆసిఫాబాద్,వెలుగు: ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ సూచించారు. శనివారం రెబ్బెన ఆర్ట్స్ అండ్​సైన్స్ కాలేజీలో కిసాన్​మోర్చా అధ్యక్షుడు, ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కొలిపాక కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో  రక్తదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన కాలేజీ ప్రిన్సిపాల్​జాకీర్​ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో లీడర్లు సుదర్శన్ గౌడ్, ఆత్మారాం నాయక్, గుల్బం చక్రపాణి, కేసరి ఆంజనేయులు గౌడ్, బాలకృష్ణ, సొల్లు లక్ష్మి, గోలెం తిరుపతి, కుసుమ విజయ, మల్లేశ్, నవీన్ గౌడ్  పాల్గొన్నారు.

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

రామకృష్ణాపూర్,వెలుగు: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​మహంకాళి శ్రీనివాస్ చెప్పారు.​ శనివారం రామకృష్ణాపూర్ లోని పార్టీ ఆఫీస్​లో నిర్వహించిన శక్తి కేంద్రాల ఇన్​చార్జీలు, బూత్​అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్​బూత్​ కమిటీలు త్వరగా పూర్తి చేయాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా సంఘటన మంత్రి సురేశ్, లీడర్లు సత్యనారాయణ, జంగంపల్లి మల్లయ్య, వీరమల్ల పాలరాజయ్య, వైద్య శ్రీనివాస్​, ఓరుగంటి సాయి, బంగారు ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులను పర్మినెంట్​ చేయాలి

నస్పూర్​,వెలుగు: సింగరేణిలో కాంట్రాక్ట్​ కార్మికులను పర్మినెంట్ చేస్తానని అసెంబ్లీలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్  ఇప్పుడు  మాట మార్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​వెరబెల్లి విమర్శించారు. శనివారం శ్రీరాంపూర్ సింగరేణి జీఎం ఆఫీస్​ వద్ద కాంట్రాక్ట్​ కార్మికుల ఆందోళనలో పాల్గొని మద్దతు పలికారు. కార్యక్రమంలో బీజేపీ, బీఎంఎస్​లీడర్లు మున్నరాజా సిసోడియా, పేరం రమేశ్, బరపాటి మారుతి, అగల్​డ్యూటీ రాజు, వినోద్​కుమార్​, గోపతి సందీప్, రామకృష్ణ, సిరికొండ రాజు, జంగంపెల్లి మహేశ్, అంబాల సాగర్​, సన్నీ, కొంతం మహేందర్​ తదితరులు పాల్గొన్నారు. 

ఉద్యోగుల ఉసురు పోసుకుంటుండు

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడుతాయనుకుంటే సీఎం కేసీఆర్​ ఉద్యోగుల ఉసురుపోసుకుంటున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ ఫైర్​ అయ్యారు. జిల్లా కేంద్రంలో వీఆర్​ఏలు 62 రోజులుగా  చేస్తున్న నిరాహార దీక్షలకు శనివారం ఆయన మద్దతు తెలిపారు. అనంతరం స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిమ్స్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. లీడర్లు అంకత్ రమేశ్, ఆదినాథ్, దినేశ్​మాటోలియా, లోక ప్రవీణ్ రెడ్డి, జ్యోతి రెడ్డి, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.