మెస్సీ పర్యటనలో సింగరేణి నిధులు దుర్వినియోగం : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

మెస్సీ పర్యటనలో సింగరేణి నిధులు దుర్వినియోగం : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్
  •   బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ 

మంచిర్యాల, వెలుగు: దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులతో ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ తీవ్రంగా ఖండించారు. 

మంచిర్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సింగరేణి కార్మికులు కష్టపడి సంస్థకు లాభాలు తెచ్చిపెడితే.. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ప్రాంతానికి సంబంధం లేని కార్యక్రమాలకు సంస్థ నిధులు ఖర్చుచేస్తోందని మండిపడ్డారు. మెస్సీ పర్యటనను స్వాగతిస్తున్నామని, కానీ ఇందుకు సింగరేణి నిధులు ఉపయోగించడం ఏమిటని ప్రశ్నించారు. 

సింగరేణి ప్రాంతంలో కార్మికులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా సంస్థ నిధులు దుర్వినియోగం చేస్తోందని ఫైర్​అయ్యారు. తాము అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఇస్తామన్న 200 గజాల స్థలం ఏమైందని ప్రశ్నించారు. సమావేశంలో నేతలు పురుషోత్తం జాజు, గాజుల ముఖేశ్​ గౌడ్, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, బింగి ప్రవీణ్, రావణవేణి శ్రీనివాస్, రాకేశ్, సుమన్, చిరంజీవి  తదితరులు పాల్గొన్నారు.