
దేశంలో తొలి ఉగ్రవాది హిందువే అని సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ పై బీజేపీ సీరియస్ అయ్యింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని తెలిపింది. ఎన్నికల్లో లబ్ధి కోసమే కమల్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై కమల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో కమల్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ టెర్రరిస్టు అంటూ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.