ఆగస్టు14న నెక్లెస్ రోడ్లో తిరంగా ర్యాలీ : రాంచందర్ రావు

ఆగస్టు14న నెక్లెస్ రోడ్లో తిరంగా ర్యాలీ : రాంచందర్ రావు
  • ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలి: రాంచందర్ రావు 

హైదరాబాద్, వెలుగు:ఈ నెల 14న హైదరాబాద్​లోని నెక్లెస్ రోడ్​లో 15 వేల మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్.రాంచందర్​రావు తెలిపారు. అదే రోజు అన్ని మండలాల్లోనూ ర్యాలీలు చేపడతామని వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల14 వరకు 14 లక్షల ఇండ్లపై జాతీయ జెండా ఎగరవేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. 

అదే రోజు విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో ప్రదర్శనలు, హాల్ మీటింగ్స్​తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 15న సాయంత్రం జెండాను గౌరవప్రదంగా అవనతం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీలు, కులాలు, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా దేశభక్తి భావనతో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్య చరిత్రను, త్యాగాలను తెలియజేయడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో  బీజేపీ  నేతలు మనోహర్ రెడ్డి, ఎన్​వీ సుభాష్,  రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు. 

మెరుగ్గా ఉన్న జిల్లాలివే..

ఆదిలాబాద్​ జిల్లాలో 275 చెరువులకు 124 చెరువులు నిండాయి. ఇక్కడ 45 శాతం చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. 3.9 టీఎంసీలకు 1.83 టీఎంసీల నీళ్లున్నాయి. 62 చెరువులకు చుక్క నీళ్లు రాలేదు. 

ఖమ్మం జిల్లాలో 499 చెరువులకు 234 చెరువులు నిండాయి. 9.1 టీఎంసీలకుగానూ 4.54 టీఎంసీల నీళ్లున్నాయి. 26 చెరువుల్లోకి వరద రావాల్సి ఉన్నది.

సూర్యాపేట జిల్లాలో 410 చెరువులుండగా.. 160 చెరువులు నిండాయి. అక్కడ 8 టీఎంసీల నిల్వకుగానూ 3.42 టీఎంసీల నీళ్లున్నాయి. 25 చెరువుల్లోకి చుక్క నీరు రాలేదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 518 చెరువులకు 228 చెరువులు నిండుకుండలా ఉన్నాయి. 7.1 టీఎంసీలకు 3.52 టీఎంసీలున్నాయి

81 చెరువుల్లోకి నీళ్లు ఇంకా రావాల్సి ఉంది. 

హనుమకొండ జిల్లాలో 351 చెరువులకు 137 చెరువులు నిండగా.. 7.1 టీఎంసీలకుగానూ 3.19 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 15 చెరువుల్లోకి వరద జీరో. 

జయశంకర్​ భూపాలపల్లిలో 367 చెరువులకు 147 చెరువులు నిండాయి. 7.8 టీఎంసీలకు 3.17 టీఎంసీల నీళ్లున్నాయి. 22 చెరువుల్లోకి వరద రావాల్సి ఉంది. 

 నిర్మల్​లో 324 చెరువుల్లో 130 చెరువులు నిండుకుండలా ఉన్నాయి. 5.9 టీఎంసీల నీళ్లకుగానూ 2.38 టీఎంసీల నిల్వలున్నాయి. 18 చెరువుల్లోకి నీళ్లు రావాలి. 

నల్గొండ జిల్లాలో 538 చెరువులకు 218 చెరువులు నిండాయి. 17.5 టీఎంసీలకుగానూ 6.81 టీంసీల నీళ్లున్నాయి. 95 చెరువులు ఇంకా నిండాల్సి ఉన్నది.  

ఈ రెండు జిల్లాల్లో పరిస్థితి దారుణం

సిద్దిపేట జిల్లాలో 3,307 చెరువులకు నిండింది 694 చెరువులే. ఈ జిల్లాలో కేవలం 20 శాతం చెరువులే నిండాయి. 25.6 టీఎంసీల నీళ్లకుగానూ 5.01 టీఎంసీలే ఉన్నాయి. ఈ జిల్లాలో 1,393 చెరువుల్లోకి చుక్క నీరు కూడా చేరలేదు. 

మెదక్ జిల్లాలో 2,599 చెరువులకుగానూ 493 చెరువులు నిండాయి. 11 టీఎంసీలకుగానూ 1.94 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఈ జిల్లాలో కేవలం 18.5 శాతం చెరువులు నిండాయి. 1,144 చెరువుల్లోకి అసలు వరద అన్నదే లేదు.