ఫిబ్రవరి 25 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర

ఫిబ్రవరి 25 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర
  •     భద్రాచలంలో ప్రారంభించనున్న ఛత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్ సాయ్

చుంచుపల్లి, వెలుగు: కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కొత్తగూడెం పార్టీ ఆఫీస్​లో విలేకరులతో మాట్లాడారు. ఛత్తీస్​గఢ్​సీఎం విష్ణుదేవ్​సాయ్​25న భద్రాచలంలో యాత్రను ప్రారంభిస్తారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలం చెర్వు శ్రీనివాస్​రావు, చుంచుపల్లి మండలాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, సుజాతానగర్ మండలాధ్యక్షుడు భూక్య రాజేశ్​నాయక్ పాల్గొన్నారు.