పంజాబ్‌లో పూర్తైన బీజేపీ మిత్రపక్షాల సీట్ల పంపకం 

పంజాబ్‌లో పూర్తైన బీజేపీ మిత్రపక్షాల సీట్ల పంపకం 

పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచాయి. తాజాగా బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల షేరింగ్ ఒప్పందం కుదిరినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా బీజేపీ 65 సీట్లలో  పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పొత్తులో భాగంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి 37 స్థానాలు, శిరోమణి అకాలీదళ్ సంయుక్త్ కు 15 సీట్లు కేటాయించినట్లు చెప్పారు. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.