ఎగ్జిట్ పోల్: ఉత్తరాఖండ్ మళ్లీ బీజేపీదే..! 

ఎగ్జిట్ పోల్: ఉత్తరాఖండ్ మళ్లీ బీజేపీదే..! 

ఉత్తరాఖండ్ మళ్లీ బీజేపీదేనని ఎగ్జిట్ పోల్ లెక్కలు చెబుతున్నాయి. 70 స్థానాలున్న ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 36 సీట్లను కమలదళం సునాయాసంగా గెలుచుకుంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుపుతారని ఎగ్జిట్ పోల్ చెబుతోంది.

యాక్సిస్ మై ఇండియా 
యాక్సిస్ మై ఇండియా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్ ఈసారి బీజేపీ వశం కానుంది. ఆ పార్టీ 36 నుంచి 46 సీట్లలో పాగా వేస్తుందని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ 20 నుంచి 30, ఇతరులు 4 నుంచి 9 స్థానాల్లో విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. 

టైమ్స్ నౌ వీటో
టైమ్స్ నౌ వీటో ఎగ్జిట్ పోల్ ప్రకారం రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవనుంది. ఆ పార్టీ 37 స్థానాల వరకు కైవసం చేసుకోనుండగా... కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆప్, ఇతరులు ఒక్కో నియోజకవర్గంలో గెలుస్తారని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.

ఇండియా న్యూస్
ఉత్తరాఖండ్లో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని ఇండియా న్యూస్ అంటోంది. ఆ సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం 32 నుంచి 41 సీట్లు బీజేపీ ఖాతాలో పడనున్నాయి. కాంగ్రెస్ 27 నుంచి 35, ఇతరులు 4, ఆమ్ ఆద్మీ పార్టీ 0 నుంచి 4 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. 

సీ ఓటర్
సీ ఓటర్ అంచనా ప్రకారం ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ  32 నుంచి 38 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ 26 నుంచి 32, ఆప్ 0 నుంచి 2, ఇతరులు 3 నుంచి 7 స్థానాలను కైవసం చేసుకుంటాయని సీ ఓటర్ సర్వే చెబుతోంది.