తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్‌ను ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ చీఫ్‌గా ఆమె చేసిన కృషిని ఆయన మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తాయనే ఊహాగానాల మధ్య ఈ భేటీ జరిగింది. సమావేశం తర్వాత అన్నామలై ట్వీట్ చేశారు. తమళినాడు బీజేపీ మాజీ చీఫ్ గా నిచేసిన సీనియర్ నాయకులలో ఒకరైన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసినందుకు సంతోషిస్తున్నాను. ఆమె రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ ఎదుగుదలకు స్ఫూర్తినిస్తాయి అని ఆయన తన ట్వీట్ లో తెలిపారు.
இன்றைய தினம், மூத்த பாஜக தலைவர்களில் ஒருவரும், @BJP4Tamilnadu மாநிலத் தலைவராகத் திறம்படச் செயல்பட்டவருமான, அக்கா திருமதி @DrTamilisai4BJP அவர்கள் இல்லத்திற்குச் சென்று நேரில் சந்தித்ததில் பெருமகிழ்ச்சி.
— K.Annamalai (@annamalai_k) June 14, 2024
தமிழகத்தில் தாமரை நிச்சயம் மலரும் என்பதை உறுதியுடன் கூறி, அதற்காகக் கடினமாக… pic.twitter.com/q22Iz7mYlv
ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరైన అమిత్ షా, తమిళి సై సౌందరరాజన్‌మధ్య జరిగిన మాటలు, హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేదికపైకి వచ్చిన తమిళి సై.. అందర్నీ అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో అమిత్ షా దగ్గర రాగానే.. ఆయన తమిళి సైని పిలిచి.. ఏదో సీరియస్ గా చెప్పటం కనిపించింది. అంతేనా.. తమిళి సైని హెచ్చరిస్తున్నట్లు వేలు చూపిస్తూ.. అమిత్ షా గంభీరంగా మాట్లాడటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. తమిళనాడు బీజేపీలో ఇటీవల జరిగిన అంతర్గత కుమ్ములాటలపై తమిళి సైతో అమిత్ షా చర్చించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు తమిళిసై స్పందించి చెక్ పెట్టగా తాజాగా వీరిద్దరూ కలుసుకొని పార్టీలో విభేదాలు లేవంటూ కార్యకర్తలకు భరోసాను ఇచ్చారు.