
జీడిమెట్ల, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల పాలనలో బీఆర్ఎస్ పేదలకు చేసిందేమీ లేదని కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. మంగళవారం కళావతి నగర్, టీఎస్ఐఐసీ కాలనీ, రాజీవ్ గాంధీనగర్, శివాలయనగర్, వెంకట్రామ్ నగర్, లక్ష్మీనగర్, సూరారం గ్రామం, విశ్వకర్మ కాలనీలో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో జనాలకు ఒరిగిందేమీ లేదన్నారు.
బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కూన శ్రీశైలం గౌడ్‌కు కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో జనసేన నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు తెలిపారు. జనసేన ఇన్ చార్జి నందగిరి సతీశ్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ సభ నిర్వహించారు. జనసేన మద్ధతుతో కుత్బుల్లాపూర్‌లో బీజేపీ జెండా ఎగడరం ఖాయమన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి, ఇంద్రసేన, శ్రీనివాస్, వారాల మహేశ్ పాల్గొన్నారు.