నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందే : బీజేవైఎం డిమాండ్

నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందే : బీజేవైఎం డిమాండ్
  • నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందే
  • గ్రూప్ –2 వాయిదా వేయాలి
  • ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి 
  • బీజేవైఎం నేతల ధర్నా 
  • లీడర్లను అరెస్టు చేసిన పోలీసులు 

మంచిర్యాల/జగిత్యాల : సీఎం కేసీఆర్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగులదరికీ  భృతి చెల్లించాలని, గ్రూప్ –2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఇవాళ ధర్నాకు దిగారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజేవైఎం కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఓట్లు దండుకొని నిరుద్యోగులను మోసం చేశాడని విమర్శించారు. వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు  రఘునాథరావు పాల్గొని మద్దతు తెలిపారు. ధర్నా చేసిన  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణను ఆయన ఇంటి వద్ద నుంచి వెంటాడి కలెక్టరేట్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకొని పీఎస్ కు తరలించారు. 

జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత ... 

నిరుద్యోగ  భృతి, లక్ష ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, గ్రూప్ –2 పరీక్ష వాయిదా వేయాలని  కోరుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు ధర్నాకు దిగిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.