ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు

V6 Velugu Posted on May 15, 2021

ఖ‌మ్మం జిల్లా : కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుంది. ఇప్ప‌టికే దేశంలో ప‌లు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తున్న బ్లాక్ ఫంగ‌స్ తెలంగాణ‌లోనూ హ‌డ‌లెత్తిస్తుంది. ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌లువురికి బ్లాక్ ఫంగ‌స్ సోక‌గా..శ‌నివారం  ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు న‌మోదైంద‌ని తెలిపారు డాక్ట‌ర్లు. మధిర నియోజకవర్గంలోని.. నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయ‌ని ఖ‌మ్మం ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు తెలిపారు. వెంట‌నే పేషెంట్ ను హైదరాబాద్ గాంధీ హాస్పిట‌ల్ కి రిఫరల్ చేశామ‌ని చెప్పారు. తాళ్లూరి భ‌ద్ర‌య్య ఇటీవ‌లే క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నార‌ని.. ఇప్పుడు  బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించామ‌న్నారు ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్ డాక్ట‌ర్లు.

Tagged Khammam district, corona, , Black fungus case

Latest Videos

Subscribe Now

More News