బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్

బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్

జైపూర్: కరోనాతో అల్లాడుతున్న భారత్ ను బ్లాక్ ఫంగస్ కూడా భయపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ గా పిలుస్తున్న ముక్రోమైనోసిస్ వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో ముక్రోమైనోసిస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా ప్రకటించింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతుండటంతో రాజస్థాన్ అలర్ట్ అయ్యింది. ఈ కేసుల చికిత్సలో కీలకమైన డ్రగ్స్ కు సంబంధించి 2,500 వయల్స్ కొనుగోలు చేయనున్నామని ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ రఘు శర్మ తెలిపారు. రాజస్థాన్ లో ఇప్పటివరకు 100 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించారు. ఈ పేషెంట్ లకు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.