బ్లాక్ పెప్పర్ టీ.. ప్రయోజనాలు ఇన్ఫినిటీ

బ్లాక్ పెప్పర్ టీ.. ప్రయోజనాలు ఇన్ఫినిటీ

బ్లాక్ పెప్పర్ టీ జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో పాటు బరువు తగ్గడం వంటి ఇతర ప్రయోజనాలనూ అందిస్తుంది. నల్ల మిరియాలు రోజువారీ వంటలలో ఉపయోగించే అత్యంత సాధారణ సుగంధ ద్రవ్యాలలో ఒకటి. వీటిని రోజూ ఆహారంలో వినియోగించినా, భోజనానికి ముందు పొడి చేసి కాస్త తీసుకున్నా శక్తివంతంగా ఉంటారని పలువురు నిపుణుల భావన. వాతావరణ మార్పులు జరుగుతున్నందున, కాలానుగుణ ఇన్ఫెక్షన్ల భారాన్ని ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మిరియాలకు అత్యంత ఆవశ్యకత ఉంది. 

బ్లాక్ పెప్పర్టీని తయారు చేయడం చాలా సులభం. దానికి ఇతర పదార్థాలను జోడించి మరింత రుచిగానూ చేసుకోవచ్చు అయితే దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే...:

1. జీర్ణక్రియ: నల్లమిరియాలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉండటం వల్ల ఇది సాఫీగా జీర్ణం కావడానికి అద్భుతంగా పనిచేస్తుందని మాక్రోబయోటిక్ న్యూట్రిషనిస్ట్,హెల్త్ ప్రాక్టీషనర్, శిల్పా అరోరా చెప్పారు పైపెరిన్ కడుపు పనితీరును ప్రేరేపిస్తుందని, అధిక మొత్తంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావానికి దారితీస్తుందన్నారు. అంతే కాదు ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుందని వెల్లడించారు.

2. బరువు తగ్గడం: మిరియాలలో ఉండే పైపెరిన్ అనేది జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడాన్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తుందని శిల్పా అరోరా చెప్పారు. నిజానికి నల్ల మిరియాలు యొక్క బయటి పొర ఫైటోన్యూట్రియెంట్‌లను కలిగి ఉంటుందని, ఇది కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో కూడా పాత్ర పోషిస్తుందని తెలిపారు.

3. రోగనిరోధక శక్తి: నల్ల మిరియాలు ప్రకృతిలో యాంటీ బాక్టీరియల్ గానూ యాంటీబయాటిక్ గానూ పనిచేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇది శరీరంలోని పోషకాలను శోషించడాన్ని ప్రోత్సహిస్తుంది. అంతే కాదు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బ్లాక్ పెప్పర్‌లో అధిక మొత్తంలో విటమిన్ సి కంటెంట్ ఉండడం వల్ల కూడా గొప్ప రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంగానూ పని చేస్తుంది.

4. డిప్రెషన్పైపెరిన్ మెదడును ప్రేరేపిస్తుంది. ఇది సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నట్టుగా భావిస్తే.. ఆ సమయంలో బ్లాక్ పెప్పర్ టీ సరైన 'పిక్-మీ-అప్' పానీయమని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

5. గొంతు నొప్పి: నల్ల మిరియాలు దగ్గు, గొంతు నొప్పిని నిరోధించడానికి భారతీయ గృహాలలో ఉపయోగించే అత్యంత సాధారణ మసాలా దినుసులలో ఒకటి. మీరు జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఈ బ్లాక్ పెప్పర్ టీ అనువైనది.

బ్లాక్ పెప్పర్ టీ ఎలా తయారు చేయాలి.. ? 

బ్లాక్ పెప్పర్ టీ

ఒక కప్పు టీ చేయడానికి1.5 కప్పుల నీటిని మరిగించండి. అందులో అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర టీ స్పూన్ తురిమిన అల్లం వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మంటను ఆపివేసి, 5 నుంచి 6 నిమిషాలు చల్లానివ్వాలి. అనంతరం టీని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి. అల్లం, నిమ్మకాయలు, నల్ల మిరియాలు స్వతహాగానే ఆరోగ్య-ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటారు. వీటికి తోడు ఏలకులు, ఫెన్నెల్ గింజలు వంటి ఇతర సుగంధ ద్రవ్యాలను కూడా జోడించి మరింత రుచికరమైన టీనీ ఆస్వాదించొచ్చు.