అఫ్గనిస్తాన్: వేడుకలు మతానికి విరుద్ధమని ఉగ్రదాడి

అఫ్గనిస్తాన్: వేడుకలు మతానికి విరుద్ధమని ఉగ్రదాడి

అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. 23 మంది గాయపడ్డారని అఫ్గాన్ హెల్త్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ వాహిదుల్లా చెప్పారు. పర్షియన్ నూతన సంవత్సరం సందర్భంగా.. కాబూల్ లోని పలు ప్రాంతాల్లో వేడుకలను జరుపుకుంటున్నారు.  ఇందులో బాగంగా.. ఓ మసీదు లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా….  తాలీబన్ లు అక్కడికి చేరుకుని రిమోట్ బాంబులతో దాడి చేశారు. మెత్తం మూడు ప్రదేశాలలో బాంబులు పెట్టినట్టుగా అక్కడి పోలీసులు తెలిపారు. ఒకటి మసీదు లోని టాయ్ లెట్ లో.. రెండు. కరెంటు మీటరులో.. మూడవది.. హస్పిటల్ పక్కన. నూతన సంవత్సర వేడుకలు మత సాంప్రదాయాలకు వ్యతిరేకమని అందుకే బాంబు దాడులు చేసినట్లు తాలీబన్ లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బాంబు దాడి కాబుల్ లోని షియాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జరిగింది.