బెంగళూరులో పేలుళ్లు.. ముగ్గురి మృతి

V6 Velugu Posted on Sep 23, 2021

బెంగళూరు: బెంగళూరు నగరంలోని న్యూ తరుగు పేటలో బాంబు పేలుడు సంభవించింది. అనుమానిత బాంబ్ బ్లాస్ట్ వలకల ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. భారీ శబ్దంతో జరిగిన పేలుడు ధాటికి ముగ్గురు వ్యక్తుల శరీర భాగాలు సుమారు 20 మీటర్ల వరకు ఎగిరి పడ్డాయి. సమీపంలోని పంచర్ షాప్ లో కంప్రెషర్ పేలిందని చెబుతుంటే.. కాదు టపాసుల గోడౌన్ నుంచి ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంచర్ షాప్ నిర్వాహకుడు మున్వర్ అస్లాం ఫయాజ్ అక్కడికక్కడే చనిపోయాడు. పేలుడు గురించిన సమాచారం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో టాటా ఏస్ డ్రైవర్ మనోహర్ ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బెంగళూరు దక్షిణ డిసిపి హరీష్ పాండే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

 

Tagged Benguluru, Bangalore, , benguluru tharugupeta area, blast in bangalore, Benguluru blast, unstable chemical, explosion in gowdown

Latest Videos

Subscribe Now

More News