పార్టీలు మారినా ప్రజల బతుకులు మారట్లే : నల్ల సూర్యప్రకాశ్

పార్టీలు మారినా ప్రజల బతుకులు మారట్లే : నల్ల సూర్యప్రకాశ్

కామారెడ్డి, వెలుగు: పార్టీలు, జెండాలు, లీడర్లు మారినా ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని బీఎల్ఎఫ్​  పార్టీ స్టేట్​చైర్మన్​నల్ల సూర్యప్రకాశ్​అన్నారు. కామారెడ్డిలో ఆదివారం బీఎల్ఎఫ్​ ఆఫీస్​ను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా సూర్యప్రకాశ్​మాట్లాడుతూ.. బహుజనులు, కార్మికులు, రైతుల అభ్యున్నతి కోసం బీఎల్ఎఫ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు. కార్మికుల పక్షాన పోరాడే వ్యక్తిని గెలిపించాలన్నారు.  

బీఆర్ఎస్​ నుంచి కేసీఆర్​పోటీ చేస్తున్నారని, ఆయన్ను సామాన్యులు కలవడం కష్టమన్నారు. కామారెడ్డి బీఎల్​ఎఫ్​అభ్యర్థిగా సిరిగాధ సిద్ధిరాములు బరిలో ఉంటారని, ఆయన్ని గెలిపించాలని కోరారు. కామారెడ్డి డీఎస్పీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వర్కింగ్​ప్రెసిడెంట్ దండి వెంకటి, లీడర్లు సిరిగాధ సిద్ధిరాములు, ఆంజనేయులు, సాయికృష్ణ, గంగామణి, సబిత పాల్గొన్నారు.