హత్రాస్ గ్యాంగ్ రేప్ : అవి రక్తం మరకలు కాదు..మా అన్న పెయింటిగ్ పనిచేస్తాడు

హత్రాస్ గ్యాంగ్ రేప్ : అవి రక్తం మరకలు కాదు..మా అన్న పెయింటిగ్ పనిచేస్తాడు

ఉత్తర్ ప్రదేశ్ హాత్రాస్ దారుణంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా దారుణానికి పాల్పడ్డ నలుగురు నిందితుల్లో ఒకరైన లూవ్ కుష్ సికార్వార్ ఇంట్లో రక్తం మరకలతో తడిసిన బట్టల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.   అయితే ఈ వాదానల్ని సికార్వార్ కుటుంబం ఖండించింది.

నిందితుడి అన్న రవి సికార్వార్ పెయింటర్ గా పనిచేస్తున్నారని, అందువల్ల అతని బట్టలు ఎర్రరంగులో ఉన్నాయని, ఆ మరకలపై సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

సీబీఐ అధికారులు రెండున్నర గంటలు ఉండి మా ఇంట్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఎరుపు రంగుతో ఉన్న బట్టల్ని తీసుకెళ్లినట్లు నిందితుడి తమ్ముడు లలిత్ సికార్వర్ అన్నాడు