పిట్లం అయ్యప్ప ఆలయంలో రక్తదాన శిబిరం

పిట్లం అయ్యప్ప ఆలయంలో రక్తదాన శిబిరం

పిట్లం, వెలుగు : అయ్యప్ప సేవా సమితి, రెడ్​క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం పిట్లం అయ్యప్ప ఆలయంలో రక్తదాన శిబిరం నిర్వహించగా 48 మంది రక్తదానం చేశారు. పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్ రక్తదానం చేశారు. 

ఈ సందర్భంగా రెడ్​క్రాస్​ సొసైటీ బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినదానితో సమానమని పేర్కొన్నారు. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి, రెడ్​క్రాస్​ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.