మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే.. బీపీ కావొచ్చు.. అశ్రద్ధ చేయొద్దు..

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే.. బీపీ కావొచ్చు.. అశ్రద్ధ చేయొద్దు..

ప్రపంచంలో అధిక రక్తపోటు సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇది ఇప్పుడు చిన్నారులకూ వ్యాప్తిస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 3% నుంచి 6% మంది పిల్లలు కౌమారదశలో అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతే కాకుండా స్థూలకాయం కారణంగా పిల్లలు, యుక్తవయస్కుల్లో చాలా సందర్భాలలో అధిక రక్తపోటు సమస్య కనిపిస్తోంది.

12 నుంచి 16 ఏళ్లలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అసాధారణ హృదయ స్పందన, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడితో కూడిన వాతావరణం, ఆహారంలో సమతుల్యత లోపించడం కూడా కారణమని, కాబట్టి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని అంటున్నారు.

లక్షణాలు : 

  • చిన్న విషయానికే పెద్ద పెద్దగా కేకలు వేయటం
  • ఇంట్లో పేరంట్స్ పై పదే పదే చిరాకు పడటం
  • ఏ విషయం చెప్పినా కోపగించుకోవటం
  • కోపాన్ని అణుచుకుని మరీ ఇతరులపై చిరాకు పడటం 
     

కారణాలు

  • జీవనశైలిలో మార్పులు
  • ఊబకాయం, అధిక శరీర ద్రవ్యరాశి సూచిక లేదా BMI
  • ఒత్తిడితో కూడిన వాతావరణం, ఆహారంలో సమతుల్యత లేకపోవడం
  • పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్ (శీతల పానీయాలు) అధిక రక్తపోటును కలిగిస్తాయి
  • మొబైల్ వినియోగం టీనేజర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది
  • కొందరిలో ఒత్తిడి వల్ల తాత్కాలికంగా వస్తుంది

కొన్ని అధిక రక్తపోటు అనేది బ్రెయిన్ స్ట్రోక్‌కి కూడా దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

అధిక రక్తపోటును నివారించే మార్గాలు

  • ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం
  • మెదడుకు అవసరమైన విశ్రాంతి ఇవ్వడం
  • అప్రమత్తంగా ఉండటం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
  • పిల్లలు యుక్తవయసులో తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండడం
  • అసాధారణ హృదయ స్పందన రేటు, తలనొప్పి, శ్వాస సమస్యల కోసం వైద్యుడిని సంప్రదించాలి.
  • సమయానికి తినడం
  • ఆహారంలో కూరగాయలు చేర్చుకోవడం
  • ఎక్కువ ఉప్పును నివారించడం