బీసీఎస్​కు అరుదైన గుర్తింపు

బీసీఎస్​కు అరుదైన గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ బ్లూ క్లౌడ్ సాఫ్‌‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీసీఎస్)కు అరుదైన గుర్తింపు లభించింది. తెలంగాణ ప్రభుత్వం, సైబర్ సెక్యూరిటీ సీఓఈ–-డిజిటల్ సిగ్నేచర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇండో డచ్ సైబర్ సెక్యూరిటీ స్కూల్ (ఐడీఎస్ఎస్) నిర్వహించిన ఆపరేషనల్ థ్రెట్స్/ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎటాక్ వెక్టర్స్ చాలెంజ్‌‌ని విజయవంతంగా నిర్వహించింది.

కార్యక్రమానికి కీలక భాగస్వామిగా సైబర్ సెక్యూరిటీ రంగంలో దాని నైపుణ్యాన్ని ప్రదర్శించింది.  ఈ సందర్భంగా బ్లూ క్లౌడ్ సాఫ్‌‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జానకి యార్లగడ్డ మాట్లాడుతూ, 2028 నాటికి సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 10.56శాతం సీఏజీఆర్‌‌తో 273 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెప్పారు. ఐడీఎస్‌‌ఎస్ కార్యక్రమానికి దోహదపడటం ద్వారా, నానాటికీ పెరుగుతున్న సైబర్ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలకమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో బీసీఎస్‌‌ కీలక పాత్ర పోషించిందని అన్నారు.