ట్విట్టర్‌‌లో పేమెంట్‌ చేస్తేనే బ్లూ టిక్‌?

ట్విట్టర్‌‌లో పేమెంట్‌ చేస్తేనే బ్లూ టిక్‌?

ట్విట్టర్‌‌ను టేకోవర్ చేసిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మస్క్ చేయబోయే మార్పుల గురించి రకరకాల ఊహాగానాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ట్విట్టర్‌‌లో వెరిఫైడ్ అకౌంట్స్‌కు బ్లూ టిక్‌ కేటాయించేందుకు కొంత మొత్తం వసూలు చేయాలని మస్క్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ట్విట్టర్‌‌లో వెరిఫైడ్ అకౌంట్స్‌కు బ్లూ టిక్ ఇస్తారు. దాని కోసం కొన్ని దశల్లో అకౌంట్‌ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ సులువు కానుంది. అయితే వెరిఫై అయిన అకౌంట్స్‌కి వచ్చిన బ్లూ టిక్‌ పర్మినెంట్‌గా ఉండాలంటే ప్రస్తుతం 4.99 డాలర్లు (రూ. 411) చెల్లిస్తున్నారు. ఇకపై ఆ బ్లూటిక్ కోసం నెలకు 20 డాలర్లు (రూ. 1,647) చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఎంత మంది ఫాలోవర్స్‌ ఉన్నా, అన్ని వెరిఫికేషన్‌లు పూర్తి చేసుకున్నా బ్లూ టిక్ మాత్రం కనిపించదు. దీన్ని నవంబర్‌‌ 7లోగా రోల్ ఔట్‌ చేసి, అందుబాటులోకి తేవాలని ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్ మేనేజ్ మెంట్‌కి సూచించాడు.