ప్రోటోటైప్ విమానాన్ని ప్రదర్శించిన బ్లూజే

ప్రోటోటైప్  విమానాన్ని  ప్రదర్శించిన బ్లూజే

హైదరాబాద్​, వెలుగు:హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన డీప్-టెక్ ఏరోస్పేస్ సంస్థ బ్లూజే ఏరోస్పేస్  వాంటిస్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఆధారిత జెన్ 2 ప్రోటోటైప్ విమానాన్ని ఆవిష్కరించింది. ఇది  200 కేజీలకుపైగా బరువును తట్టుకుంటుంది.   

గరిష్ట టేకాఫ్ బరువు 500 కేజీలు. పూర్తిగా బ్యాటరీతో పనిచేసే ఈ విమానాన్ని ప్రయాణీకుల రవాణా, పట్టణ, ప్రాంతీయ రవాణా అవసరాల కోసం వాడుకోవచ్చు. భవిష్యత్తులో ఒక టన్ పేలోడ్ సామర్థ్యం గల భారీ లాజిస్టిక్స్, హైడ్రోజన్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వేరియంట్లను తీసుకురావడానికి ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ సహాయపడుతుంది.