
మపుటో: తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్లో శుక్రవారం బోటు ప్రమాదం జరిగింది. బీరా పోర్టు సమీపంలో భారతీయులతో వెళ్తున్న ఓ బోటు నీట మునిగింది. దీంతో ముగ్గురు చనిపోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆరుగురిని అధికారులు రక్షించారు. గల్లంతైన వారి కోసం అధికారులు సముద్రంలో గాలిస్తున్నారు. సముద్రంలో లంగరు వేసి ఉన్న ఓ ఆయిల్ ట్యాంకర్‌లోకి సిబ్బందిని తరలించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొజాంబిక్‌లోని భారత హైకమిషన్ ఈ ఘటనను ధ్రువీకరించింది.