యూపీ బోటు ప్రమాదం.. ఇంకా దొరకని 17 మంది ఆచూకీ

యూపీ బోటు ప్రమాదం.. ఇంకా దొరకని 17 మంది ఆచూకీ
  • ప్రమాద సమయంలో బోటులో 40 మంది.. 20 మంది సురక్షితం
  • ముగ్గురి మృతదేహాలను వెలికితీసిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది
  • 17 మంది ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ
  • నిన్నటి నుంచి కొనసాగుతున్న గాలింపు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ బోటు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.  ఇప్పటి వరకు మూడు మృతదేహాలు వెలికితీశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. నిన్న యూపీలోని బాందా దగ్గర యమునా నదిలో పడవ బోల్తా పడి 20 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 
20 మందిని సురక్షితంగా రక్షించగా...మరో 20 మంది గల్లంతయ్యారు. అయితే ఇవాళ ముగ్గురు మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీసింది. మరో 17 మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.