అందుబాటులోకి బోటింగ్

అందుబాటులోకి బోటింగ్

ఆసిఫాబాద్ ,వెలుగు : ఆసిఫాబాద్​ మండలం కుమ్రంభీం ప్రాజెక్టులో శనివారం బోటింగ్​ ప్రారంభమైంది. ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్​పేయి, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ నాగేశ్వరరావు తో కలిసి కలెక్టర్​రాహుల్​ రాజ్​ బోటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు బోటులో విహరించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్​తెలిపారు. జిల్లా ప్రజలకు బోటింగ్​ అందుబాటులోకి రావడంతో టూరిజం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో పర్యాటకుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. టూరిజం అధికారులు మాట్లాడుతూ టిక్కెట్​ధర ఒక్కొక్కరికి రూ. 50 నిర్ణయించినట్లు తెలిపారు. బర్త్​డే, ఇతర వేడుకలు జరుపుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, డీపీవో రమేశ్, డీపీఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత

వృద్ధుల సంక్షేమం, పోషణ అందరి బాధ్యతని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. శనివారం కలెక్టరేట్​లో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పోస్టర్లను రిలీజ్​చేశారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వృద్ధుల కొరకు ఆసరా పెన్షన్, కంటి వెలుగు, డే కేర్ సెంటర్స్, రాష్ట్రీయ వయోశ్రీ యోజన, ఫిజియోథెరపీ, మొబైల్ మెడికేర్ యూనిట్స్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ 14567 నంబర్​ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్​సూచించారు. ఆసిఫాబాద్​చిల్డ్రన్స్ పార్కులో బతుకమ్మ పండుగతో పాటు దసరా వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోషణ మాసం సందర్భంగా చిరుధాన్యాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ పై అవగాహన కల్పించాలన్నారు.  ప్రభుత్వం ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం త్వరగా పూర్తిచేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.

శాస్ర్తీయ పద్ధతిలో పంట కోత ప్రయోగాలు 

మంచిర్యాల, వెలుగు: వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేయడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం కలెక్టరేట్​లో పంటకోత ప్రయోగాలపై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులు, మండల ప్రణాళిక అధికారులకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు హాజరయ్యారు. అధికారులు వారికి కేటాయించిన గ్రామాల్లో శాస్త్రీయ పద్ధతిలో పంటకోత ప్రయోగాలు నిర్వహించాలన్నారు. సీపీవో జి.సత్యం, డీఏవో కల్పన పాల్గొన్నారు.  వయోవృద్ధుల సంక్షేమానికి కృషి  జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమానికి అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 30 వరకు చేపట్టనున్న వారోత్సవాలపై శనివారం కలెక్టరేట్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన బుక్స్​, వాల్​ పోస్టర్లను రిలీజ్​ చేశారు. డీడబ్ల్యూవో చిన్నయ్య, సిబ్బంది పాల్గొన్నారు.  26 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్​ తెలంగాణ  ఓపెన్ స్కూల్ టెన్త్​, ఇంటర్​ పరీక్షలు 26 నుంచి అక్టోబర్ 4 వరకు డీఈవో ఎస్​.వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12  గంటల వరకు, 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జడ్పీ బాయ్స్​ హైస్కూల్​, గర్ల్స్​ హైస్కూళ్లలో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.