
'గదర్ 2' మూవీతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ అప్పు ఎగ్గొట్టినట్లు వార్తలొస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోన్ తీసుకొని.. తిరిగి చెల్లించని కారణంగా ఆయనకు చెందిన ఓ విల్లాను వేలం వేయనున్నట్లు సదరు బ్యాంక్ యాజమాన్యం పత్రికల్లో ప్రకటన చేసింది. వచ్చే నెలలో ఈ వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది.
ముంబై జుహూ ప్రాంతంలోని గాంధీగ్రామ్ రోడ్ లో గల తన విల్లాను గ్యారెంటీగా పెట్టి కొంత కాలం క్రితం సన్నీ డియోల్.. తమ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నారని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటనలో పేర్కొంది. ఆయన.. తన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీతో పాటు జుహూలో ఉన్న తన విల్లాను గ్యారంటర్లుగా చూపించి రుణాన్ని పొందినట్లు ప్రకటనలో తెలిపింది.
సన్నీ డియోల్ దాదాపు రూ.56 కోట్లు చెల్లించాలని.. బ్యాంక్ నోటీసులకు స్పందించకపోవడంతో ఆయన విల్లాను వేలం వేయనున్నట్లు సదరు బ్యాంక్ యాజమాన్యం నేడు పలు పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఈ వేలం సెప్టెంబర్ 25న జరగనుంది. ఆసక్తిగల వారు వేలంలో పాల్గొనాలనుకుంటే మొదట రూ 5.14 కోట్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
'Gadar' by Bank of Baroda !!
— Megh Updates ?™ (@MeghUpdates) August 20, 2023
Actor Sunny Deol's plush Mumbai villa , Sunny Villa located in Juhu,Mumbai is being auctioned by Bank of Baroda for recovery of loan of Rs 55crs and interest. Auction to be held of Sept 25, reserve price Rs 51.43crs pic.twitter.com/TTMRXeWISL
2001లో విడుదలైన ‘గదర్’కు సీక్వెల్‌గా వచ్చిన 'గదర్ 2' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సన్నీ డియోల్ తారాసింగ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టినట్లు సమాచారం.