
ప్రపంచంలోనే అతి పెద్ద శునకం పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీ అనేక విధాలుగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక దేశాల నుంచి అతిథులు వచ్చారు.
కుక్కకు గిన్నిస్ బుక్ లో స్థానం
పోర్చుగీస్ లో బాబీ అనే ఓ కుక్క 20 లేదా 25 సంవత్సరాలు జీవించడం కాదు..ఏకంగా 31వ పుట్టినరోజు జరుపుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. మే 11న బాబీకి 31 ఏళ్లు నిండాయి. అయితే ఆ కుక్క పుట్టినరోజు వేడుక మే 13న జరిగింది. ఈ పార్టీకి వంద మందికి పైగా అతిథులు వచ్చారు.
కుక్కకు 31వ బర్త్ డే వేడుక
బాబీ అనే కుక్క పుట్టినరోజును యజమాని కోస్టా ఘనంగా జరిపారు. ఇరుగుపొరుగువారిని ఆహ్వానించి మటన్, చికెన్ , చేపలతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాబీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కోస్టా వెల్లడించారు.
అలెంటెజో జాతి కుక్క
పోర్చుగీస్ రాఫిరో డో అలెంటెజో జాతికి చెందిన మగ కుక్క. పోర్చుగల్‌లోని కాంక్విరాస్ గ్రామానికి చెందిన లియోనెల్ కోస్టా అనే మహిళ ఈ కుక్కను పెంచుకుంటోంది. కోస్టా తల్లిదండ్రులు మే 13, 1992న కుక్కను తమ ఇంటికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు బాబీని బంధించలేదని కోస్టా తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాబీ పేరు నమోదైంది. బాబీకి ప్రపంచంలోనే అతి పెద్ద కుక్క అనే బిరుదు లభించింది.
15 - 20 ఏళ్లు మాత్రమే ..
సాధారణంగా కుక్కలు 15 నుండి 20 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. కుక్కలు 25 సంవత్సరాలు జీవించాయంటే అది చాలా అరుదని చెప్పాలి. అయితే కొన్ని శునకాలు రెండు లేదా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించాయంటే అద్భుతం అని చెప్పాలి.
బాబీ ఇంకా ఆరోగ్యంగానే ఉంది
31 ఏళ్ల తర్వాత కూడా బాబీ ఆరోగ్యం బాగానే ఉందని కోస్టా చెప్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాబీ పేరు నమోదు చేయడానికి ముందు, బాబీ మెడికల్ సర్టిఫికేట్‌ను తనిఖీ చేశారు. ఇందులో బాబీ పుట్టిన సంవత్సరం 1992 అని పేర్కొన్న తరువాత పురాతన కుక్క అని బిరుదు ఇచ్చారు.
రికార్డ్ బ్రేక్
ఇది జరిగిన రెండు వారాల తర్వాత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోర్చుగల్‌లో బాబీ అనే కుక్కను భూమి మీద అత్యధిక కాలం జీవించి ఉన్న కుక్కగా రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు అత్యధిక కాలం జీవించి ఉన్న కుక్క ఆస్ట్రేలియాకు చెందిన బ్లూ (19-10-1939) పేరిట ఉంది.దాదాపు శతాబ్దం పాటు ఈ రికార్డు కొనసాగింది. బ్లూ రికార్డును బాబీ బద్దలు గొట్టింది. 1992లో పోర్చుగీసు ప్రభుత్వం రికార్డుల్లో పుట్టిన తేదీ నమోదు అయింది. బాబీ నాలుగు మగ కుక్కపిల్లలలో ఒకటిగా జన్మించింది.