ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు బ్రిటన్‌‌‌‌ పౌరుల మృతదేహాలు తారుమారు..

ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు బ్రిటన్‌‌‌‌ పౌరుల మృతదేహాలు తారుమారు..

లండన్‌‌‌‌లో జరిపిన డీఎన్‌‌‌‌ఏ టెస్టులో వెల్లడి

న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన బ్రిటన్‌‌‌‌కు చెందిన ఇద్దరి మృతదేహాలు తారుమారయ్యానే వార్తలు కలకలం రేపుతున్నాయి. రెండు కుటుంబాలకు చేరాల్సిన డెడ్‌‌‌‌బాడీలు మారిపోయాయని తేలింది. దీంతో మృతుల బంధువులు అంత్యక్రియలను నిలిపివేశారు. మరో కేసులో ఇద్దరు బాధితుల మృతదేహాలు ఒకే శవపేటికలో పార్సెల్‌‌‌‌ వచ్చాయని యూకే మీడియా తెలిపింది. 

జూన్‌‌‌‌ 12న అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయినవాళ్లలో 12 మంది బ్రిటన్‌‌‌‌కు చెందిన వాళ్లున్నారు. అహ్మదాబాద్‌‌‌‌లోని ఆస్పత్రిలో డీఎన్‌‌‌‌ఏ టెస్టులు చేసిన తర్వాత వాళ్ల డెడ్‌‌‌‌బాడీలను గుర్తించి యూకేకు తరలించారు. అయితే, మన దేశం నుంచి వచ్చిన మృతదేహాలకు లండన్‌‌‌‌లో తిరిగి డీఎన్‌‌‌‌ఏ టెస్టులు చేయగా, అందులో ఇద్దరి మృతదేహాలు తారుమారైనట్లు తేలింది. ఒక శవపేటికలోని డెడ్‌‌‌‌బాడీ గుర్తతెలియని వ్యక్తిది అని, మరో శవపేటికలో రెండు డెడ్‌‌‌‌బాడీలు వచ్చాయని బాధిత కుటుంబాల తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.