వికారాబాద్: సర్పంచ్ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాములు

వికారాబాద్: సర్పంచ్ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాములు

వికారాబాద్, వెలుగు: సర్పంచ్​ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బోయిని రాములును ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి మందిపల్​వెంకట్​తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ రిసార్ట్​లో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా సామాని నాగిరెడ్డి, ఉపాధ్యక్షులుగా ప్రమీల, యాదవరెడ్డి, దుబ్యా నాయక్, గౌరవ అధ్యక్షుడిగా చెంబాస్ కుమార్, కార్యదర్శులుగా కరణం రాధ, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, మశ్చేందర్ రెడ్డి, కోశాధికారిగా రవీందర్ పవార్ ఎన్నికయ్యారు. 

పంచాయతీలకు నేరుగా నిధులు మళ్లించాలని  డిమాండ్ చేశారు. సర్పంచ్​లకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతోపాటు రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా, నెలకు రూ.25 వేలు గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. సర్పంచ్​ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాములు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి వెంకట్, జిల్లాలోని సర్పంచ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.