
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి (Bhagwant kesari). అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్, శ్రీలీల కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (arjun rampal) కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు నటుడు అర్జున్ రాంపాల్. ఇది భగవంత్‌కేసరి సినిమా షూటింగ్ పూర్తయిన సమయం. అంటే నా సినిమా పూర్తయిన సమయం. ఇది నా తొలి తెలుగు సినిమా. షూటింగ్ సమయంలో చాలా ఉద్వేగానికి లోనయ్యాను. షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగిందని చాలా ధైర్యంగా చెప్పగలను. నా పెద్దన్న బాలకృష్ణ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. బ్రో మీ శక్తికి, ప్రేమకు నా ధన్యవాదాలు. నా ప్రియమైన తమ్ముడు అనిల్ రావిపూడికి కూడా నా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు అర్జున్ రాంపాల్.
ALSO READ :అన్న సినిమాతో వస్తున్న బాలయ్య.. నిజమైతే అంతే సంగతులు.
దీంతో పాటు షూటింగ్ పూర్తయిన సమయంలో బాలయ్యను ఆత్మీయంగా హగ్ చేసుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు అర్జున్ రాంపాల్. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక భగవంత్ కేసరి అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.