అన్న సినిమాతో వస్తున్న బాలయ్య.. నిజమైతే అంతే సంగతులు.

అన్న సినిమాతో వస్తున్న బాలయ్య.. నిజమైతే అంతే సంగతులు.

నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా వీరసింహారెడ్డి(Veerasimhareddy)తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil ravipudi)తో భగవంత్ కేసరి(Bhavanth kesari) అనే సినిమా చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్ అగర్వాల్(kajal agarwal), శ్రీలీల(Sreeleela) కీ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

అయితే గత కొంత కాలంగా ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మొదటి నుండి ఈ సినిమా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ తో వస్తుందని వార్తలు బలంగా వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమా బాలకృష్ణ అన్న హరికృష్ణ(Harikrishna) నటించిన స్వామీ(Swamy) సినిమా కాన్సెప్ట్ తో రానుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. 2004లో  వచ్చిన స్వామీ సినిమా అన్నాచెల్లెళ్ల కథతో వచ్చింది. రత్న కుమార్(Rathna kumar) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 

ALSO READ :నా పెద్దన్న బాలయ్యకు.. నటుడు అర్జున్‌ రాంపాల్ ఎమోషనల్ పోస్ట్

అయితే ఈ సినిమా కథకే కాస్త మార్పులు చేసి భగవంత్ కేసరి సినిమా కథను రెడీ చేశారట అనీల్ రావిపూడి. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. స్వామీ సినిమా కథ చాలా అవుట్ డేటెడ్. అలాంటి కథ ఈ కాలంలో ఎలా సెట్ అవుతుంది.. అలా ఐతే అంతే సంగతులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నిజంగా స్వామీ కథతో వస్తుందా లేదా కొత్త కథ తీసుకున్నారా అనేది తెలియాలంటే అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందే.